
యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. నీలి నీలి ఆకాశం సాంగ్ రిలీజ్ చేశారు. ఎస్వి బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. యాంకర్ గా బుల్లితెర మీద తన టాలెంట్ తో మెప్పించిన ప్రదీప్ మాచిరాజు ఈసారి సిల్వర్ స్క్రీన్ పై తన ప్రతిభ చూపించేందుకు సిద్ధమయ్యాడు.
సినిమా టైటిల్ కు హీరో హీరోయిన్ కనబడిన తీరుకి అసలు సంబంధం లేకుండా ఉంది. ఇక అనూప్ చాలా రోజుల తర్వాత మంచి మెలోడీతో వచ్చాడు. అలా రిలీజైందో లేదో కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించింది. ఓ మంచి ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో రేంజ్ ఫాలోయింగ్ ఉన్న ప్రదీప్ మొదటి సాంగ్ మిలియన్ వ్యూస్ సాధించడం సినిమాకు మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. మరి యాంకర్ ప్రదీప్ తొలి ప్రయత్నంగా చేస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.