
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా చేస్తే ఏ హీరోయిన్ కు అయినా పాపులారిటీ డబుల్ అవుతుంది. కాని ఈ అమ్మడికి మాత్రం ఆ సినిమా వల్ల ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. మళయాళ పరిశ్రమ నుండి వచ్చి తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అను ఇమ్మాన్యుయెల్ యువ హీరోలతో జోడీ కట్టి ఒక్కసారిగా పవర్ స్టార్ ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో అమ్మడు ఖాతా ఖాళీ అయ్యింది.
ఆ తర్వాత నా పేరు సూర్య సినిమా కూడా ఫ్లాప్ అవడంతో అమ్మడికి తెలుగులో అవకాశాలే లేకుండా పోయాయి. ఇక లేటెస్ట్ గా అను ఇమ్మాన్యుయెల్ కు లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుని ఫైనల్ చేశారట. మరి అమ్మడికి ఈ సినిమా అయినా హిట్టు పడుతుందా లేదా అన్నది చూడాలి.