ఎన్.టి.ఆర్-త్రివిక్రం మూవీలో బాలకృష్ణ..!

అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఈ సినిమా కథ రాయలసీమ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ చేశారట. అంతేకాదు ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట.

ఇవన్ని వాస్తవం అనిపించేలా ఉండగా ఈ సినిమాలో తారక్ తండ్రిగా నందమూరి బాలకృష్ణ నటిస్తాడు అన్నది హాట్ న్యూస్ గా మారింది. ఎన్.టి.ఆర్, బాలకృష్ణ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ కోరిక.. మరి త్రివిక్రం తారక్ సినిమాలో బాలయ్య నిజంగా చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది.