
సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. ఈమధ్య కెరియర్ లో వెనుకపడ్డ హీరోయిన్ రెజినా మెగా మూవీలో ఛాన్స్ పట్టేసిందట.
అయితే చిరు సినిమాలో రెజినా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా లేక ఐటం సాంగా అన్నది తెలియాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం రెజినాని అడిగినట్టు తెలుస్తుంది. అయితే దానికి లీడ్ గా ఒకటి రెండు సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. కొరటాల శివ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ కాజల్ కు మంచి మైలేజ్ ఇచ్చింది. మరి ఈ సాంగ్ తో రెజినాకు లక్ కలిసి వస్తుందేమో చూడాలి.