సరిలేరు గురించి సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అటు డైరక్టర్ అనీల్ రావిపుడి కెరియర్ లోనే కాదు మహేష్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. 

జనవరి 11న రిలీజైన ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడటం విశేషం. సినిమా దర్శకుడు చాలా చక్కగా తీశారని.. ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించారని.. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారని.. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ అయ్యిందని. సరిలేరు నీకెవ్వరు నిజంగానే బ్లాక్ బస్టర్ కా బాప్ అని అన్నారు కృష్ణ. కృష్ణ గారి బైట్ కు మహేష్ మీరేనా సూపర్ స్టార్.. సరిలేరు మీకెవ్వరు అంటూ కామెంట్ చేశాడు.