శ్రీముఖి 'ది బోల్డ్' అవతార్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి కొత్త అవతారం చూసి అందరు షాక్ అవుతున్నారు. పలు టివి షోలతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత అంతకుముందు చేసే షోలకు బై బై చెప్పి కొత్త షోలు చేస్తుంది. బిగ్ బాస్ తర్వాత ఆలోచనలు మార్చుకున్న శ్రీముఖి తన క్రేజ్ ను డబుల్ ట్రిపుల్ చేసుకోవాలని చూస్తుంది. అందుకే బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ తరహాలో ఓ క్రేజీ ఫోటో షూట్ తో షాక్ ఇచ్చింది.

మాములుగా ఇన్నర్ వేర్స్ తో తెలుగు యాంకర్లు కనిపించడం చాలా అరుదు. అలాంటి ప్రయత్నం చేయాలన్నా సరే భయపడతారు. కాని శ్రీముఖి మాత్రం బోల్డ్ అవతార్ తో సర్ ప్రైజ్ చేసింది. ఇన్నాళ్లు మనం చూసిన శ్రీముఖేనా ఇది అనుకునేలా ఆమె హాట్ పిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ స్టాగ్రాం లో ఈ పిక్స్ షేర్ చేసిన శ్రీముఖి వెల్ థ్యాంక్స్ 2020 అంటూ కామెంట్ పెట్టింది. మరి అమ్మడు ఆ ఫోటోలకు.. ఆ కామెంట్ కు తగిన ఆఫర్ ఏదైనా పట్టేసిందా అనుకుంటున్నారు ఆడియెన్స్.