
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ముగింపు దశకు చేరుకుంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగా హీరోకి విలన్ గా నటిస్తున్నాడు కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. తమిళంలో హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఎలాంటి పాత్రైనా సరే నేను రెడీ అని చెప్పే విజయ్ సేతుపతి విలన్ గా చేయడమే ఈ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పొచ్చు.
ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో చిన్న పాత్ర చేశాడు విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ఫుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు విజయ్ సేతుపతికి 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా బడ్జెట్ పాతిక కోట్లు కాగా హీరోకి కోటికి అటు ఇటుగా ఇచ్చారట. అయితే హీరో కన్నా విలన్ కే ఎక్కువ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. విజయ్ క్రేజ్ ను వాడుకునేందుకు ఈ రేంజ్ లో ఇచ్చారు. అంతేకాదు డెబ్యూ మూవీకి పాతిక కోట్లు బడ్జెట్ పెట్టడంపై కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.