
యువ హీరో నితిన్ హీరోగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. నితిన్ సరసన రష్మిక మందన్న అటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి మూడవ వారంలో రిలీజ్ అవుతుంది. సినిమా నుండి వచ్చిన టీజర్ ఆసక్తి పెంచగా నితిన్, రష్మికల జోడీ అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ పెయిర్ కు వచ్చిన పాజిటివ్ టాక్ ను ప్రమోషన్స్ కు వాడేస్తున్నారు చిత్రయూనిట్. ఈమధ్యనే నితిన్, రష్మిక డ్యాన్స్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక లేటెస్ట్ గా సినిమా నుండి మరో క్రేజీ పోస్టర్ వదిలారు. నితిన్, రష్మిక జోడీ మరోసారి సూపర్ అనిపించేలా చేసింది. పర్ఫెక్ట్ పెయిర్ గా నితిన్, రష్మిక ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. ఇద్దరు స్టిల్స్ తో అదరగొడుతుండగా చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి భీష్మతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నారని చెప్పొచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి మ్యూజిక్ అందిస్తున్నారు.