
ఎఫ్-2 సూపర్ హిట్ తర్వాత వెంకటేష్, మజిలీ హిట్ తర్వాత నాగ చైతన్య కలిసి చేసిన క్రేజీ మూవీ వెంకీమామ. రియల్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్ లో కూడా ఆ పాత్రల్లో చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు. కె.ఎస్ బాబి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. అందుకే వెంకీమామ హిట్ ప్రాజెక్ట్ అయ్యింది. ఎఫ్-2 నుండి మళ్లీ మునుపటి వెంకటేష్ ను మళ్లీ ఆడియెన్స్ చూస్తున్నారు. ఇక చైతు కూడా తన నటనలో పరిణితి చూపిస్తున్నాడు.
ప్రస్తుతం అక్కినేని హీరోల్లో నాగార్జున, అఖిల్ ల కన్నా చైతు కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక వెంకటేష్ తో కలిసి చేసిన వెంకీమామ వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవగా ఫైనల్ గా ఈ మూవీ 39.34 కోట్లు వసూళు చేసింది. వెంకటేష్, చైతుల కెరియర్ లో వెంకీమామ కూడా హిట్ సినిమాగా నిలిచింది.
ఏరియాలవారిగా వెంకీ మామ వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 13.03 కోట్లు
సీడెడ్ : 4.51 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.62 కోట్లు
నెల్లూరు : 1.10 కోట్లు
కృష్ణ : 1.83 కోట్లు
గుంటూరు : 2.72 కోట్లు
ఈస్ట్ : 2.61 కోట్లు
వెస్ట్ : 1.42 కోట్లు
ఏపీ/తెలంగాణ : 32.84 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 3.30 కోట్లు
ఓవర్సీస్ : 3.20 కోట్లు
వరల్డ్ వైడ్ : 39.34 కోట్లు