
ఎలక్షన్స్ లో గెలిస్తే సీన్ ఎలా ఉండేదో కాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్ కు సైన్ చేసిన పవన్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా పవన్ మరో సినిమాకు ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కూడా కన్ ఫ్యూజన్ లో పడేసిన ఆ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియలేదు.
ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ 27వ సినిమా కూడా ముహుర్తం పెట్టేశాడు. క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. ఆ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది. పవన్ లేకుండానే ఆ సినిమా ముహుర్త కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాకు సంబందించిన అఫిషియల్ డీటైల్స్ వెళ్లడిస్తారట. పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ సినిమాకు కూడా పార్లర్ గా షూటింగ్ లో పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట పవన్ కళ్యాణ్.