'జాను' ట్రైలర్.. సేమ్ టూ సేమ్ దించేశారు.. కాని..!

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 మూవీని తెలుగులో జానుగా రీమేక్ చేశారు. మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ తెలుగు వర్షన్ ను డైరెక్ట్ చేశారు. జానులో శర్వానంద్, సమంత కలిసి నటించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. 

తమిళ 96 తెలుగు వర్షన్ సేం దానిలానే ఉంది. జాను ట్రైలర్ చూస్తే 96 తెలుగు డబ్బింగా అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే శర్వా, సమంతల జోడీ బాగుంది. తమిళంలో సూపర్ హిట్ అంతేకాదు తెలుగు ఆడియెన్స్ కూడా చాలా వరకు ఈ సినిమా చూశారు. అయినా సరే దిల్ రాజు ఈ సినిమాను చాలా ధైర్యంగా రీమేక్ చేశారు. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందో లేదో చూడాలి. మ్యాజిక్ రిపీట్ అయితే కనుక జాను కూడా ఇక్కడ సూపర్ హిట్ అవడం పక్కా అని చెప్పొచ్చు.