
అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న త్రివిక్రం శ్రీనివాస్. తన తర్వాత సినిమా ఎన్.టి.ఆర్ తో ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అరవింద సమేత తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అనేసరికి ఆడియెన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది. ఇక తారక్ సినిమా తర్వాత త్రివిక్రం వరుసగా మెగా హీరోల సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత రాం చరణ్ తో త్రివిక్రం సినిమా ఉంటుందని టాక్.
చరణ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కూడా త్రివిక్రం సినిమా చేస్తాడని అంటున్నారు. చరణ్ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో పాటుగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కూడా నిర్మిస్తుందని తెలుస్తుంది. చిరు, త్రివిక్రం సినిమా కొణిదెల బ్యానర్ లో వస్తుందట. ఈ సినిమాలే కాదు చరణ్, చిరు తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రం.
సో మొత్తానికి తారక్ తో సినిమా తర్వాత మూడు మెగా ప్రాజెక్టులతో త్రివిక్రం అదిరిపోయే మెగా స్కెచ్ వేశాడని అంటున్నారు. ఇలా చూస్తే త్రివిక్రం తో మరో హీరో సినిమా చేయాలంటే మినిమం మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే అన్నమాట.