RRR నుండి క్రేజీ పిక్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ లో అజయ్ దేవగన్ పాల్గొన్నారు. ఆ విషయాన్ని కన్ఫాం చేస్తూ షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్, చరణ్, అజయ్ దేవగన్, రాజమౌళి దిగిన పిక్ షేర్ చేశాడు ఎన్.టి.ఆర్.

అజయ్ దేవగన్ కు వెల్ కం చెబుతూ షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అలియా భట్, ఒలివియా మోర్స్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త అక్టోబర్ కు వాయిదా పడుతుందని తెలుస్తుంది. దాదాపు 10 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తుంది.