మళ్లీ జబర్దస్త్ కు నాగబాబు..?

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. జబర్దస్త్ నుండి ఇలా బయటకు వచ్చాడో లేదో అలా జీ తెలుగులో అదిరింది షోలో ప్రత్యక్షమయ్యాడు. జబర్దస్త్ షోని దించేస్తూ వస్తున్న అదిరింది షో ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం విఫలమవుతుంది. మొదటి ఎపిసోడ్ నుండి ఆ షోకి ఆశించిన స్థాయిలో టి.ఆర్.పి రేటింగ్ రావట్లేదని తెలుస్తుంది. ఇక చివర ఎపిసోడ్ కు అయితే మరీ దారుణంగా 6 రేటింగ్ వచ్చిందట.

ఓ పక్క నాగబాబు లేని జబర్దస్త్ రోజా సింగిల్ హ్యాండ్ తో లాక్కొచ్చేస్తుంది. నాగబాబు మాత్రమే లేడు కాని మిగతా అంతా జబర్దస్త్ షోని సక్సెస్ ఫుల్ గా నడిచేలా చేస్తుంది. అంతేకాదు కమెడియన్స్ వెరైటీ స్కిట్స్ తో ఆకట్టుకుంటున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోకి వచ్చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు జబర్దస్త్ కంటెస్టంట్ గెటప్ శ్రీను చెప్పడం విశేషం. సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ కలిసి నటించిన 3 మంకీస్ సినిమా ప్రమోషన్స్ లో గెటప్ శ్రీను నాగబాబు మళ్లీ జబర్దస్త్ కు వస్తున్నారని సెన్సేషనల్ న్యూస్ లీక్ చేశాడు. మరి అది నిజంగా జరుగుతుందా లేదా అన్నది చూడాలి.