
డైరక్టర్ గా ఛాన్స్ రావడం గొప్ప విషయం అయితే అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడం కూడా మంచి విషయమని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో క్రేజీ డైరక్టర్స్ లో ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి పేరు కూడా చేరిందని చెప్పొచ్చు. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు.
ఎఫ్-2 వరకు డైరక్టర్ గా ఓకే అనిపించుకున్న అనీల్ రావిపుడి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరుతో సూపర్ హిట్ కొట్టి స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరాడు. సరిలేరు తర్వాత ఎఫ్-2 సీక్వల్ గా ఎఫ్-3 స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట అనీల్ రావిపుడి. అయితే మహేష్ కు మంచి హిట్ ఇచ్చిన ఈ డైరక్టర్ కు మెగా పవర్ స్టార్ రాం చరణ్ నుండి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత చేసే సినిమా డైరక్టర్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు. ఎఫ్-3 చేసే ఆలోచన ఉన్నా రాం చరణ్ సినిమా ఓకే అయితే అనీల్ పంట పండినట్టే లెక్క.