
లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా సూపర్ హిట్ కాగా ఈ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది.
సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో ఈ సినిమాను 5.5 కోట్లకు కొనేశారట. నాగ చైతన్య కెరియర్ లో ఓవర్సీస్ లో ఈ సినిమానే హయ్యెస్ట్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఏషియన్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలంగాణా కుర్రాడి పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడు. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి.