
కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ లో కోనా వెంకట్ నిర్మాతగా హేమంత్ మధుకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నిశ్శబ్ధం. స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్, షాలిని పాండే ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేసింది. జనవర్ 31న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు.
అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం నిశ్శబ్ధం ఫిబ్రవరి 20న కూడా రావడం కష్టమని తెలుస్తుంది. సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పెండింగ్ అవడం వల్ల ఫిబ్రవరి 20 అనుకున్న రిలీజ్ కాస్తా ఏప్రిల్ 2కి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. సో అనుష్క ఫ్యాన్స్ మరో రెండు నెలలు సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.