ఆ సినిమా కథతో నాని 'టక్ జగదీష్'..?

నిన్ను కోరి, మజిలీ సినిమాలతో హిట్ అందుకున్న డైరక్టర్ శివ నిర్వాణ మూడవ సినిమాగా చేస్తున్న టక్ జగదీష్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా తీరు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ జూలైలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కథ ఒకప్పటి సూపర్ హిట్ మూవీ బలరామకృష్ణులు సినిమాను పోలి ఉంటుందని అంటున్నారు. శోభన్ బాబు, రాజశేఖర్, జగపతి బాబు కలిసి నటించిన బలరామకృష్ణులు అప్పట్లో సూపర్ హిట్ మూవీ. 

ఆ సినిమాకు ఫ్రీమేక్ గా ఆ కథనే ఇప్పటి ట్రెండ్ కు తగినట్టుగా టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడట శివ నిర్వాణ. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్య థమన్ సూపర్ ఫాం లో ఉండగా నాని టక్ జగదీష్ కోసం థమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. నానితో పాటుగా జగపతి బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది.