
యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం 96 రీమేక్ గా వస్తున్న జాను సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటుగా శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ శ్రీకారం సినిమా ఫస్ట్ లుక్ లో శర్వానంద్ విలేజ్ లుక్ లోనే అలరించాడు.
ప్లేన్ డార్క్ ఎల్లో షర్ట్, లుంగీ, భుజం మీద టవల్ తో నాచురల్ లుక్ తో అదరగొట్టాడు శర్వానంద్. శతమానం భవతి తర్వాత శర్వానంద్ చేస్తున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాగా శ్రీకారం ప్రత్యేకత తెచ్చుకుంది. నూతన దర్శకుడే అయినా కిశోర్ చాలా పర్ఫెక్ట్ గా సినిమా తీస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేయగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. శర్వానంద్ నటించిన జాను సినిమా ఫిబ్రవరి మొదటి వారం రిలీజ్ అవుతుంది.