
వరుస ఫ్లాపులతో కెరియర్ డైలమాలో పడ్డ మాస్ రాజా రవితేజ రీసెంట్ గా వచ్చిన డిస్కో రాజా సినిమా జస్ట్ ఓకే అనిపించగా ఆ సినిమా జోష్ తో మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. డిస్కో రాజా సెట్స్ మీద ఉన్నప్పుడే గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రవితేజ జనవరి 26న తన పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమా ఎనౌన్స్ మెంట్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.
రమేష్ వర్మ డైరక్షన్ లో రవితేజ హీరోగా సినిమా కన్ ఫాం చేశారు. ఆల్రెడీ రమేష్ వర్మ డైరక్షన్ లో వీర సినిమా చేశాడు రవితేజ.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే లాస్ట్ ఇయర్ రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈసారి మాస్ రాజాతో అదిరిపోయే కథతో సినిమా చేస్తున్నాడట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.