నాగార్జునకు జోడీగా ఆ ఇద్దరు

కింగ్ నాగార్జున హీరోగా సాల్మన్ డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కి పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పని చేస్తుండటం విశేషం. సినిమాలో నాగార్జున పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ భామ దియా మీర్జా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సయామీ ఖేర్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మన్మథుడు 2 డిజాస్టర్ కాగా నాగార్జున కథల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా పూర్తి చేశాక కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమా కూడా లైన్ లో పెట్టాలని చూస్తున్నారు నాగార్జున.