సునీల్ కు మరో లక్కీ ఛాన్స్

కమెడియన్ గా తెలుగు ప్రేక్షక హృదయాలను గెలిచిన సునీల్ ఆ క్రేజ్ తో హీరోగా కొన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే హీరోగా చేయడం కష్టమని భావించి కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేస్తున్నాడు సునీల్. అరవింద సమేత నుండి మళ్లీ రెగ్యులర్ కమెడియన్ గా చేస్తూ వస్తున్న సునీల్ రీసెంట్ గా వచ్చిన మాస్ మహరాజ్ రవితేజ డిస్కో రాజా సినిమాలో విలన్ గా కూడా సర్ ప్రైజ్ చేశాడు.

ఇక మీదట వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని ఫిక్స్ అయిన సునీల్ లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమాలో సునీల్ కు మంచి పాత్ర దక్కిందట. బాలయ్య బాబుతో త్రూ అవుట్ సినిమా ఉండే రోల్ ఇదని తెలుస్తుంది. కెరియర్ లో ఈమధ్య బాగా వెనుకపడ్డ సునీల్ కు ఇదో మంచి అవకాశమని చెప్పొచ్చు. బాలయ్య ఇచ్చే ఈ ఛాన్స్ ను సునీల్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.