గోపిచంద్ 'సీటీమార్'

మాన్లీ హీరో గోపిచంద్ ఈమధ్య కెరియర్ పరంగా చాలా వెనుకపడ్డాడు. అడపాదడపా సినిమాలు చేస్తున్నా అవేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో గోపిచంద్ ఒక క్రేజీ సినిమాతో వస్తున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో గోపిచంద్ హీరోగా వస్తున్న సినిమా సీటీమార్. కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న టైటిల్ నే కన్ ఫాం చేస్తూ లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో గోపిచంద్ లుక్ రివీల్ అవలేదు కాని టైటిల్ పోస్టర్ మాత్రం క్రేజీగా ఉంది. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫాం లోకి వచ్చిన మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. లౌక్యం, జిల్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోవడంలో వెనుకపడ్డ గోపిచంద్ సీటీమార్ తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.