రిలీజ్ రోజే పైరసీ ప్రింట్..!

సూపర్ స్టార్ రజినికాంత్, ఏ.ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా దర్బార్. తెలుగు, తమిళ, హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా జనవరి 9 అంటే నిన్న శుక్రవారం రిలీజైంది. స్టార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కాచుకు కూర్చునే పైరసీ రాయుళ్లు.. దర్బార్ ను రిలీజ్ రోజే పైరసీ చేసి ఆన్ లైన్ లోకి వదిలారు. మాములుగా అయితే సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో వస్తుంది. కాని దర్బార్ మాత్రం రిలీజ్ రోజే పైరసీ అవడంతో దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు.

అయితే ఆ పైరేటెడ్ లింక్ బ్లాక్ చేయించగా అప్పటికే చాలా డౌన్ లోడ్స్ అయ్యాయని తెలుస్తుంది. దీనిపై క్రైం పోలీసులు యాక్షన్ లోకి దిగారని తెలుస్తుంది. పైరసీ ఎక్కడ నుండి జరిగింది.. ఎవరు చేశారన్న విషయంపై విచారణ జరుపుతున్నారు. చెప్పి మరి పైరసీ చేసే తమిళ్ రాకర్స్ కూడా దర్బార్ సినిమా పైరేటెడ్ ప్రింట్ ఆన్ లైన్ లో ఉంచారని తెలుస్తుంది.