శర్వా, సమంత.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా..?

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీ 96 తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగులో రీమేక్ ను మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ డైరెక్ట్ చేస్తుండగా శర్వానంద్, సమంతలు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రీసెంట్ గా రిలీజైంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో శర్వానంద్, సమంతలు కచ్చితంగా అలరించేలా ఉన్నారు.

టీజర్ చూస్తే సేం తమిళంలో లానే తెలుగులో కూడా మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నారు. ముఖ్యంగా శర్వానంద్, సమంతల జనటన హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. టీజర్ లో శర్వానంద్ కన్నా సమంత సర్ ప్రైజ్ చేసింది. పెళ్లి తర్వాత క్రేజీ సినిమాలు చేస్తూ అలరిస్తున్న సమంత 96 రీమేక్ జానుతో మరో సంచలన విజయం అందుకోవడంలో ఎలాంటి సందేహం లేదని అనిపిస్తుంది. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.