సిని హీరోలకు తాకిన రాజధాని సెగ

ఏపి రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ చేస్తున్న ఉద్యమ సెగ సినిమా వాళ్లకు తగులుతుంది. ఏపికి మూడు రాజధానులను ప్రకటించిన ఏపి సిఎం వై.ఎస్ జగన్ నిర్ణయానికి నిరసనగా అమరావతి రైతులు చేస్తున్న ధర్నాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ గొడవ సినిమా పరిశ్రమకు విస్తరించింది. అమరావతినే ఏపి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్ధి, యువజన పోరాట సమితి ఏపికి చెందిన హీరోల ముందు ధర్నాలు చేయడం మొదలు పెట్టారు.

అందులో భాగంగా ఈరోజు సూపర్ స్టార్ మహేష్ ఇంటి ముందు వారు ధర్నా చేశారు. ఈరోజు నుండి 19 వరకు హీరోల ఇంటి ఎదుట ఆందోళనల్ చేస్తామని యువజన పోరాట సమితి ప్రకటించింది. రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలాల ఏర్పాటు చేయాలి కర్నూలులో హైకోర్టు.. అమరావతి, వైజాగ్ లో హైకోర్ట్ బెంచీలు ఏర్పాటు చేయాలని వారు అంటున్నారు. ఏపికి చెందిన హీరోలు ఈ అంశంపై స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.