.jpeg)
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. ఒక బూతు సినిమా అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఆ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేయడంతో పాటు విజయ్ దేవరకొండను ఎక్కడికో తీసుకు వెళ్లి పెట్టింది. అంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ అలాంటి బోల్డ్ పాత్రలు బోల్డ్ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి సినిమాలు చేయడం నా వల్ల కాదు అన్నాడు.
అర్జున్ రెడ్డి వంటి స్క్రిప్ట్‌లు నా వద్దకు వస్తే ఖచ్చితంగా చేయను అనే చెప్తాను. ఎందుకంటే నేను అలాంటి స్క్రిప్ట్‌లకు సెట్ అవ్వను. నేను చేసే సినిమాలు నాకు కంఫర్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. అలాంటి బోల్డ్ కథలు నేను కంఫర్ట్‌గా ఫీల్ అవ్వను. అందుకే అర్జున్ రెడ్డి తరహా సినిమాలు చేయలేను. ముందు ముందు కూడా నేను చేయను అన్నాడు. అయితే అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ నటన మాత్రం చాలా బాగుందని ప్రశంసించాడు. మొత్తానికి బూతు సినిమాల జోలికి వెళ్లను అంటూ ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు.