సూపర్‌స్టార్‌కు హిట్‌ ఇచ్చి మెగాస్టార్‌ను టార్గెట్‌ పెట్టుకోబోతున్నాడట

అతి తక్కువ సినిమాల ఏజ్‌తో ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న అనీల్‌ రావిపూడి లక్‌ అంతా ఇంతా లేదు. చిన్నా చితకా సినిమాలు చేసి పర్వాలేదు అనిపించుకున్న అనీల్‌ రావిపూడి గత ఏడాది ఎఫ్‌ 2 చిత్రంతో ఏకంగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఎఫ్‌ 2 సక్సెస్‌తో ఇంప్రెస్‌ అయిన మహేష్‌బాబు వెంటనే అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఒప్పుకోవడం, వెంటనే అనీల్‌ రావిపూడి కథను సిద్దం చేయడం దాన్ని కేవలం నాలుగు నెలల్లోనే సరిలేరు నీకెవ్వరు చిత్రం అంటూ రూపొందించడం జరిగింది. 

సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు అనీల్‌ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్‌ అయితే తన టార్గెట్‌ చిరంజీవి అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు చిరంజీవి హాజరు అయ్యి నా గురించి మాట్లాడటంను జీవితంలో మర్చిపోలేను. ఆయన అంటే చాలా అభిమానం. చిరంజీవి గారు ఓకే అనాలే కాని కేవలం రెండు మూడు నెలల్లోనే స్క్రిప్ట్‌ పూర్తి చేసి ఆరు నెలలోలనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ చెప్పుకొచ్చాడు. మరి చిరంజీవి ఈ యువ దర్శకుడికి ఛాన్స్‌ ఇస్తాడేమో చూడాలి.