
ఈ సంక్రాంతికి సినిమాల హంగామా బాగానే ఉండేలా కనిపిస్తుంది. తెలుగు స్ట్రైట్ సినిమాలు మూడింటితో పాటుగా సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. కళ్యాణ్ రాం ఎంత మచివాడవురా.. ఈ సినిమాతో పోటీగా రజినికాంత్ దర్బార్ వస్తుంది. ఈ సినిమాల బిజినెస్ వివరాలు చూస్తే ఈ నాలుగు సినిమాల్లో మహేష్ మూవీ 101.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది.
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కూడా 85 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ సినిమా తెలుగు వర్షన్ మాత్రం ఎన్వి ప్రసాద్ 14 కోట్లకు కొన్నారట. కళ్యాణ్ రాం సినిమాకు కూడా 15 నుండి 20 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. అంటే ఎలా లేదన్నా సంక్రాంతికి 250 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాల్లో ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.