బన్ని కోసం సూపర్ స్టార్ వస్తున్నాడు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఇంకా చాలామంది స్టార్స్ నటించారు. టాలీవుడ్ స్టార్ అయినా కూడా అల్లు అర్జున్ కు మళయాళంలో కూడా క్రేజీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. బన్ని చేసిన ప్రతి సినిమా అక్కడ రిలీజై సూపర్ హిట్ సాధిస్తున్నాయి. 

అందుకే అల వైకుంఠపురములో సినిమాను కూడా అక్కడ భారీగా రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్న మ్యూజికల్ కాన్ సర్ట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ సినిమా మళయాళంలో కూడా స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు గెస్ట్ గా మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. ఇక్కడ సోలోగా ప్రమోట్ చేసిన బన్ని అక్కడ మాత్రం మోహన్ లాల్ ను ఆహ్వానించారు. మొత్తానికి ఈ సంక్రాంతికి బన్ని తెలుగులోనే కాదు మళయాళంలో కూడా క్రేజీ హిట్టు కొట్టేలా ఉన్నాడు.