రిలీజ్ ముందు దర్బార్ కు షాక్

సూపర్ స్టార్ రజినీకాంత్, ఎ. ఆర్ మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్ లో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 9న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు రెండు రోజులు ముందు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అడ్డుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సినిమా రిలీజ్ ఆపింది మన దగ్గర కాదు మలేషియాలో.. నిర్మాత సుభాస్కరన్ తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే మలేషియాలో రిలీజ్ చేయనిస్తామని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. 

2.o సినిమాకు సంబందించిన 23 కోట్లు పెండింగ్ ఉండగా అవి క్లియర్ చేయకుండా ఈ సినిమా రిలీజ్ చేయనివ్వమని అంటున్నారు. కోర్ట్ కూడా ఈ వ్యవహారం తేలే వరకు సినిమా రిలీజ్ ను మలేషియా వరకు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సుభాస్కరన్ ఈ గొడవలను రిలీజ్ లోగా సాల్వ్ చేస్తారో లేదో చూడాలి.