నాన్నకు ప్రేమతో అల్లు అర్జున్..!

అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమా మ్యూజిక్ కాన్ సర్ట్ లో అల్లు అర్జున్ స్పీచ్ అదరగొట్టాడు. ముఖ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ తన తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు బన్ని. తన తండ్రి లాంటి తండ్రి ఎవరు ఉండరని.. ఆయనలో సగం ప్రేమని చూపించినా గొప్పే అన్నారు అల్లు అర్జున్. కొడుకు పుట్టాక ఆ విషయం అర్ధమైందని అన్నారు బన్ని.

అల్లు అరవింద్ గురించి మాట్లాడే టైంలో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. ఇక త్రివిక్రం తో సినిమా అంటే చాలా ఇష్టమని.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో కాంబినేషన్ పై అంచనాలు పెంచారు. ఇక ఇప్పుడు వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.