
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ 96. కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. 96 తెలుగు రీమేక్ లో శర్వాంద్, సమంత జంటగా నటిస్తున్నారు. ఈ రీమేక్ కు టైటిల్ గా జాను అని పెట్టారు.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎడారిలో హీరో శర్వానంద్ నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది. తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. మహానుభావుడు తర్వాత సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న శర్వానంద్.. పెళ్లైన తర్వాత కూడా సూపర్ ఫాం లో ఉన్న సమంత కలిసి చేస్తున్న ఈ జాను ఎలా ఉండబోతుందో చూడాలి.