సరిలేరు నీకెవ్వరు.. సందడంతా వాళ్లదే..!

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. జనవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవడం జరిగింది. ఈవెంట్ లో భాగంగా మహేష్ మీద ప్రశంసలు కురిపించారు చిరంజీవి. ప్రయోగాత్మక సినిమాలు తీయడంలో మహేష్ ముందుంటాడని.. ఆ విషయంలో మహేష్ ను మెచ్చుకోవాల్సిందే అన్నారు చిరంజీవి.

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ లుక్ పోస్టర్ పేపర్ యాడ్ చూసి ఆర్మీ లుక్ లో మహేష్ బాగున్నాడని అనిపించింది. ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో షాక్ అయ్యానని అన్నారు చిరంజీవి. తక్కువ టైం లో సినిమా పూర్తి చేయడం వల్ల నిర్మాతలు బాగుంటారని.. ఇక ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ అని లేకుండా ఇలా ఫ్యాన్స్ అంతా కలిసి ఉంటే చాలా బాగుంటుందని అన్నారు చిరంజీవి. కృష్ణ గారి కొడుకు మహేష్ దగ్గర నుండి మహేష్ బాబు తండ్రి కృష్ణ అనే స్థాయికి మహేష్ ఎదిగాడని. కృష్ణ గారు ఎప్పుడూ ప్రయోగాలకు పెద్ద పీఠ వేశారనిన్.. ఆయన సిని పరిశ్రమకు చేసిన గుర్తింపుకు గాను ఆయనకు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఇచ్చేందుకు తెలుగు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను అడుగుతున్నానని అన్నారు చిరంజీవి. చిరు రావడంతో మహేష్ ఈవెంట్ కు మెగా ఫ్యాన్స్ కూడా చాలా భారీ సంఖ్యలో అటెండ్ అవడం విశేషం. 

ఇక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి కూడా మాట్లాడారు చిరంజీవి. 15 ఏళ్లుగా కనిపించకుండా పోయిన విజయశాంతి ఈ సినిమాలో నటించడం గొప్ప విషయమని అన్నారు. చిరు, విజయశాంతి కొద్దిసేపు తమ పాత జ్ఞాపకాలకు వెళ్లి వచ్చారు. ఎప్పటికి మీరే మా హీరో అని విజయశాంతి అనగా నువ్వలా అంటే గుండె జారిపోతుంది నువ్వే నా హీరోయిన్.. కలిసి సినిమా చేద్దాం అన్నారు చిరంజీవి. అయితే రాజకీయ పరంగా విజయశాంతి తన మీద చేసిన కామెంట్స్ గురించి కూడా ప్రస్థావించారు చిరు. నన్ను అలా అనడానికి మనసెలా వచ్చింది శాంతి అని అడిగారు చిరంజీవి. రాజకీయాలు శత్రువులను పెంచితే.. సినిమా స్నేహితులను పెంచుతుందని.. చాలా రోజులుగా మా మధ్య ఉన్న గ్యాప్ ఈ వేడుకతో క్లియర్ అయ్యింది. అందుకు మహేష్ కు థ్యాంక్స్ అన్నారు చిరంజీవి.

దాసరి తర్వాత సిని పెద్దగా చిరంజీవి ఆ బాధ్యత మీద వేసుకున్నారని చెప్పొచ్చు. మొన్న మా డైరీ ఆవిష్కరణలో జరిగిన గొడవ కావొచ్చు.. అంతకుముందు పరిశ్రమలో ఏ చిన్న వేడుక అయినా చిన్న హీరో ఫంక్షన్ అయినా పిలవగానే వచ్చి తన సపోర్ట్ అందిస్తున్నారు చిరంజీవి.