అల వైకుంఠపురములో ట్రైలర్.. త్రివిక్రమ్ మార్క్..!

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం.. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా మ్యూజిక కాన్సర్ట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా అల వైకుంఠపురములో ట్రైలర్ రిలీజ్ చేశారు. త్రివిక్రం ప్రతి సినిమా లానే ట్రైలర్ లో ఆయన మార్క్ కనిపించేలా మంచి మాటలు.. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ఆకట్టుకున్నాయి. 

ఇక హీరోయిన్ పూజా హెగ్దె, నివేదా పేతురాజ్ లు కూడా మెప్పించారు. టబు, జయరాం పాత్రలు కూడా కీలకమని తెలుస్తుంది. మహేష్ సినిమా మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా ఉండగా అల వైకుంఠపురములో క్లాస్ గా వస్తుంది. త్రివిక్రం మార్క్ ఎంటర్టైనింగ్ అందించడంలో ఏమాత్రం ఢోకా లేదు అనేలా అల వైకుంఠపురములో ట్రైలర్ ఉంది. మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయిన ఈ సినిమా ట్రైలర్ లో సినిమా కథను పెద్దగా రివీల్ చేయకుండా థియేటర్ లో ఆడియెన్స్ సర్ ప్రైజ్ అయ్యేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ సంక్రాంతి బరిలో పోటీగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు అల వైకుంఠపురములో ఎలాంటి ఫైట్ ఇస్తుందో చూడాలి.