జబర్దస్త్ లో మరో నాగబాబు ఎవరు..?

జబర్దస్త్ కామెడీ షో నుండి మెగా బ్రదర్ నాగబాబు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కొంతమంది టీం లీడర్స్ కూడా జబర్దస్త్ నుండి వెళ్లిపోయి జీ తెలుగు అదిరిందిలో జాయిన్ అయ్యారు. అయితే జబర్దస్త్ లో నాగబాబు ప్లేస్ లో రెండు ఎపిసోడ్స్ ఆలి, మరో రెండు ఎపిసోడ్లు తరుణ్ భాస్కర్, ఒకటి రెండు ఎపిసోడ్లు పోసాని కృష్ణమురళి ఇలా అందరు వచ్చి వెళ్తున్నారు. ఇక లేటెస్ట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు నరేష్ ఈ షో జడ్జిగా కనిపించారు.

వెటరన్ హీరో ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న నరేష్ జబర్దస్త్ షో జడ్జిగా కొనసాగుతారని తెలుస్తుంది. నరేష్ కూడా కామెడీ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన వాడే.. అందుకే పంచులు.. ప్రాసలు ఆయనకు అలవాటే.. షోలో వారు చేసే కామెడీకి తగిన పంచ్ వేయాలంటే అందుకు నరేష్ లాంటి వ్యక్తి పర్ఫెక్ట్ అని అంటున్నారు. మరి నరేష్ అయినా జబర్దస్త్ జడ్జిగా కోసాగుతాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కు తెలుస్తుంది.