దేవరకొండ విజయ్.. మల్టీప్లెక్స్ బిజినెస్..!

చేసిన మూడు సినిమాలతోనే టాలీవుడ్ లో స్టార్ రేంజ్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. యూత్ ఆడియెన్స్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న దేవరకొండ విజయ్ కేవలం సినిమాలే కాదు తనకు ఉన్న ఈ ఇమేజ్ తో రకరకాల బిజినెస్ లు చేస్తున్నాడు. ఆల్రెడీ రౌడీ వేర్ అంటూ క్లాతింగ్ బిజినెస్ లో దిగిన విజయ్ దేవరకొండ కొత్తగా మల్టీప్లెస్ బిజినెస్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. మహబూబ్ నగర్ లో ఆల్రెడీ ఏవిడి అనే మల్టీప్లెక్స్ కట్టించారట.

ఆసియన్ సునీల్ నారంగ్ తో విజయ్ దేవరకొండ కలిసి ఈ మల్టీప్లెక్స్ నిర్మించినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సునీల్ నారంగ్ మహేష్ తో ఏ.ఎం.బి సినిమాస్ నిర్మించాడు. అది సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు విజయ్ కూడా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి వచ్చాడు. దశాబ్ధ కాలంగా హీరోలుగా సినిమలు చేస్తున్న వారు కూడా చేయలేని.. ఆలోచించలేని బిజినెస్ థాట్స్ తో విజయ్ కెరియర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ సినిమాల్లో ఆఫర్లు తగ్గినా ఈ బిజినెస్ లు తనని సపోర్ట్ గా ఉంటాయని చెప్పొచ్చు.