
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం వెంటనే సుక్కు సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం ఐకాన్ మూవీ కూడా ఉందని తెలిసిందే. అప్పుడెప్పుడో టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే సుకుమార్ సినిమా తర్వాత ఐకాన్ కన్నా ముందు మధ్యలో తమిళ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్.
సౌత్ లోనే కాదు నేషనల్ వైడ్ గా స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు ఏ.ఆర్.మురుగదాస్. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినికాంత్ తో దర్బార్ సినిమా చేశాడు. ఆ మూవీ కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో సంక్రాంతికి వస్తుంది. దర్బార్ ప్రమోషన్స్ లో తెలుగు మీడియాతో ముచ్చటించిన మురుగదాస్ అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని.. అయితే ఆయన సినిమాలు పూర్తి చేశాక తమ సినిమా ఉంటుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తమిళంలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కాని కుదరలేడు. మరి మురుగదాస్ సినిమా అయినా ఉంటుందో లేదో చూడాలి.