విజయశాంతి కండీషన్స్ పెడుతుందా..!

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ గ్రాండ్ గా జరిగుతుందని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో భారతి పాత్రలో ఆమె నటించింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా తర్వాత విజయశాంతి వరుస సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. అయితే అనీల్ రావిపుడి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు ఒప్పుకున్న విజయశాంతి తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు కొన్ని కండీషన్స్ పెడుతుందట.

తనతో సినిమా చేయాలంటే హీరోయిన్ కు ఇచ్చే రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. అంతేకాదు సినిమాలో తనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే చేస్తుందని చెబుతుందట. ఈ రెండు కండీషన్స్ కు ఒప్పుకుంటేనే విజయశాంతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. మరి ఈ కండీషన్స్ విజయశాంతికి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.