
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. జనవరి 12న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేసుకుంది. అల వైకుంఠపురములో ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత బన్ని త్రివిక్రం కాంబోలో వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అవుతుందని అంటున్నారు. సినిమా మొత్తం త్రివిక్రం మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సెన్సార్ నుండి టాక్ వచ్చింది. థమన్ మ్యూజిక్ సూపర్ హిట్ అవగా విజువల్ గా కూడా సూపర్ అనిపించేలా ఉంటాయట. సెన్సార్ సభ్యుల నుండి సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మరి జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.