వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్.. విజయ్ దేవరకొండ మార్క్ లవ్ స్టోరీ..!

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. కే.ఏ వళ్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్ త్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే విజయ్ దేవరకొండ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ తన నాలుగు ప్రేమకథతో ఈ సినిమా చేస్తున్నాడు. సినిమా టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించినా ఎక్కడో అర్జున్ రెడ్డి సినిమా తరహా పోలికలు కనబడుతున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ మార్క్ లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుంది. మరి టీజర్ అంచనాలను అందుకోగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.