'మా' ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా..!

గురువారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సిని పెద్దల సలహాలను తప్పుపడుతూ హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు హాట్ న్యూస్ గా మారాయి. ముఖ్యంగా చిరంజీవి మంచి మైకులో.. చెడు చెవిలో చెప్పిన సామెతను కూడా పక్కన పెట్టి రాజశేఖర్ తన స్వరం పెంచారు. మాలో గొడవపై రాజశేఖర్ నోరు పెంచగా ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి అతను కావాలనే ప్రోగ్రాం ను డిస్ట్రబ్ చేయాలని గొడవ సృష్టించాలనే వచ్చాడని అన్నారు. దీనిపై యాక్షన్ తీసుకోవాలని అన్నారు.

మోహన్ బాబు కూడా ఈ విషయంపై సీరియస్ గా మాట్లాడారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత రాజశేఖర్ తన నిర్ణయంతో షాక్ ఇచ్చారు. మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు రాజశేఖర్. మా అధ్యక్షుడు నరేష్ ప్రవర్తన పట్ల అసంతృతి వల్లే తను రిజైన్ చేస్తున్నానని.. ఈసి మెంబర్స్ తో చర్చించకుండానే తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. నరేష్ కు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదని. ఈరోజు మా డైరీ రిలీజ్ వేదిక మీద మాట్లాడిన అంశాలు కూడా కమిటీలో చర్చించలేదని అన్నారు. తను చాలా సెన్సిటివ్.. ఎమోషనల్.. అందుకే ఈరోజు వేదిక మీద అలా స్పందించానని అన్నారు రాజశేఖర్.