
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా తమిళ హీరో విష్ణు విశాల్ తో ప్రేమలో పడ్డదా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. న్యూ ఇయర్ సందర్భంగా విష్ణు విశాల్ తో గుత్తా జావాలా దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో వీరి క్లోజ్ నెస్ చూస్తుంటే ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు అనిపిస్తుంది. విష్ణు విశాల్ తన భార్య రజినితో విడాకులు తీసుకుని సోలోగా ఉంటున్నాడు.
జ్వాలా గుత్తా కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇప్పుడు ఈ ఒంటరి పక్షులు ఒకటైనట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా కలిసి తిరుగుతున్నా వీళ్లది ప్రేమే అని కన్ ఫాం చేయలేదు. అయితే వీరి క్లోజ్ నెస్ చూస్తే మాత్రం ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా మై బేబీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ణు విశాల్ తో దిగిన పిక్స్ షేర్ చేసిన గుత్తా విషయాన్ని చెప్పకనే చెప్పిందని అంటున్నారు.