
కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ సినిమా తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ హీరోగా చేసిన ఈ ప్రాజెక్ట్ అక్కడ రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో ధనుష్ నటనకు తమిళ ప్రేక్షకులు నీరాజనాలు అందించారు. అయితే ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ లో వెంకటేష్ కు జోడీగా శ్రీయ నటిస్తుందని అన్నారు.
అయితే వెంకటేష్ శ్రీయ కాంబినేషన్ రొటీన్ అనుకున్నారో ఏమో కాని ఇప్పుడు వెంకటేష్ కు జతగా ప్రియమణిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఈమధ్య బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జ్ గా ఉంటున్న ప్రియమణికి ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. అసురన్ రీమేక్ లో ప్రియమణి నటిస్తే మళ్లీ ఆమె కెరియర్ ట్రాక్ లోకి వచ్చినట్టే. సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.