
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే డైరీ ఆవిష్కరణ ఈ సంవత్సరం కూడా సిని పరిశ్రమల పెద్దల సమక్షంలో జరిగింది. నరేష్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో డైరీ ఆవిష్కరణ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో రాజశేఖర్ 'మా'లో గొడవల గురించి ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ గొడవల వల్లే తన ఫ్యామిలీలో గొడవలు కూడా జరుగుతున్నాయని. తన యాక్సిడెంట్ కు కారణం ఈ గొడవలే అన్నారు రాజశేఖర్. అంతకుముందు మాట్లాడిన చిరంజీవి మాటలను వ్యతిరేకిస్తూ రాజశేఖర్ మాట్లాడటంతో చిరంజీవి రాజశేఖర్ మీద సీరియస్ అయ్యారు.
ఇక్కడ గొడవ సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే కొందరు అలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ఏవైనా గొడవలు ఉంటే కలిసి మాట్లాడుకోవాలి అంతేకాని గొడవలకు దారి తీయకూడదని అన్నారు చిరంజీవి. మంచి ఉంటే మైకులో చెప్పాలి.. చెడు ఉంటే చెవిలో చెప్పాలి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ఏవైనా అసౌకర్యాలు ఉంటే చర్చించుకోవాలని అన్నారు చిరంజీవి. రాజశేఖర్ మాటలకు తీవ్రంగా హర్ట్ అయ్యారని చిరంజీవి చెప్పారు. తప్పకుండా యాక్షన్ కమిటీ వేసి పనిష్మెంట్ తీసుకోవాలని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ గొప్ప స్థాయిలో ఉంచాల్సిన బాధ్యత అందరి మీద ఉందని.. దానికి కావాల్సిన విధంగా మాలాంటి వారిని సహాయం తీసుకోవాలని అన్నారు చిరంజీవి.
ఈ వేడుకలో పాల్గొన్న మోహన్ బాబు కూడా రాజశేఖర్ కామెంట్స్ కు ఫైర్ అయ్యారు. చిరంజీవి చెప్పినట్టుగా అందరు కలిసి పనిచేయాలని అన్నారు. ఈ వేడుకకు విశిష్ట అతిథిగా వచ్చిన టి.సుబ్బిరామి రెడ్డి కూడా నరేష్ అధ్యక్షతన మా ఇంకా ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటుందని అన్నారు.