రెజినా నాట్ ఇంట్రెస్టడ్..!

కెరియర్ అటు ఇటుగా ఉన్న టైం లో ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేసేయాలి. కాని రెజినా మాత్రం స్టార్ ఛాన్సులు వచ్చినా కాదంటోంది. స్టార్ సినిమా ఛాన్స్ అంటే హీరోయిన్ గా కాదులేండి.. ఐటం సాంగ్ ఆఫర్ వచ్చినా సారీ అనేసిందట. ఈమధ్య కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న అమ్మడు ప్రతినాయకిగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అ!.. ఈ ఇయర్ ఎవరు సినిమాలో ఆమె పాత్ర అందరిని మెప్పించింది.

ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రెజినా మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అడిగారట. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రసుత్తం హైదరాబాద్ లో షూటింగ్ జర్పుకుంటుంది. సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఒక సాంగ్ కోసం రెజినాని అడిగారట. అయితే రెజినా మాత్రం అందుకు నో చెప్పిందని తెలుస్తుంది.