
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత డైరక్టర్ గోపిచంద్ తో రవితేజ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ఒకటి న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
చేతిలో సోడా పట్టుకుని రవితేజ పోలీస్ లుక్ తో కనిపించాడు. పోస్టర్ లో రవితేజ లుక్ చాలా ఇంటెన్స్ తో ఉంది. మాస్ రాజా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా జనవరి 24న రిలీజ్ ఫిక్స్ చేశారు. క్రాక్ మూవీ మాత్రం ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో వచ్చే అవకాశం ఉంది.