
మెగా హీరో సాయి తేజ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు అల్లు అరవింద్ కు చాలా డౌట్లు వచ్చాయట. ఫ్యామిలీ సినిమాగా మారుతి రాసుకున్న ఈ సినిమా కథ యూత్ కు నచ్చుతుందా అని అన్నాడట అల్లు అరవింద్. బూతు లేకుంటే యువతకు నచ్చుతుందా అన్నాడట.
అయితే మారుతికి మాత్రం మీకు కథ నచ్చితే చేసేద్దాం అన్నాడట. మారుతి మీద నమ్మకంతో సినిమా చేశాడు అల్లు అరవింద్. ఇక సినిమా చూసిన ఆయన ఎంజాయ్ చేశారట. అయితే మనం నవ్వినా ఆడియెన్స్ నవ్వుతారా అని మరో డౌట్ వచ్చిందట. ఒకవేళ నవ్వినా బయటకు వచ్చి సినిమా బాగుందని చెబుతారా అని ఇన్ని రకాల డౌట్లు పెట్టుకున్నాడట. అల్లు అరవింద్ పెట్టుకున్న డౌట్లను క్లియర్ చేసి ప్రతిరోజూ పండగే వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది.
చిత్రలహరి తర్వాత సాయి తేజ్ నటించిన ఈ సినిమా కూడా కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలుస్తుంది. రిలీజైన 10 రోజుల్లో పాతిక కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది ప్రతిరోజూ పండగే.