సామజవరగమన సాంగ్ వచ్చేసింది..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ సాంగ్ సామజవరగమన సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది.

సాంగ్ ఆడియోనే రికార్డులు సృష్టించగా వీడియో ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టుగానే అల వైకుంఠపురములో సినిమా నుండి సామజవరగమన వీడియో సాంగ్ ప్రోమో వదిలారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా సామజవరగమన వీడియో ప్రోమో రిలీజైంది. సాంగ్ సూపర్ హిట్ కాగా దానికి తగినట్టుగా బన్ని ఫ్లోర్ మూమెంట్స్ ఇరగదీశాడు. సామజవరగమన ఈ ఒక్క సాంగ్ తోనే సినిమాకు సూపర్ క్రేజ్ తెచ్చారు. సాంగ్స్ సూపర్ అనిపించుకోగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.