ప్రవీణ్ సత్తారుకి నాగార్జున ఛాన్స్..!

గుంటూర్ టాకీస్ తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ప్రవీణ్ సత్తారు పిఎస్వి గరుడవేగ సినిమాతో సత్తా చాటగా ఆ సినిమా తర్వాత రాజశేఖర్ తో మరో సినిమా ప్రయత్నించగా ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. లేటెస్ట్ గా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున సినిమా చేస్తాడని తెలుతుంది. ప్రవీణ్ చెప్పిన కథ నాగార్జునకు నచ్చిందట. అందుకే అతని డైరక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

ప్రస్తుతం నాగార్జున సోల్మాన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే బంగార్రాజు సినిమా ఉంటుందని అన్నారు. కాని ప్రవీణ్ సత్తారు సినిమా ముందు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. గరుడవేగ తరహాలోనే నాగార్జున సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.